వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

  • 282 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 82 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 1.45 శాతం చొప్పున నష్టపోయిన ఎల్ అండ్ టీ, విప్రో షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... కాసేపటికే కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708కి చేరుకుంది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 22,122 వద్ద స్థిరపడింది. ఐటీ, రియాల్టీ, మెటల్, కన్జ్యూమర్ గూడ్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.79%), భారతి ఎయిర్ టెల్ (2.10%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), సన్ ఫార్మా (1.28%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.45%), విప్రో (-1.45%), టీసీఎస్ (-0.67%), టాటా మోటార్స్ (-0.66%), యాక్సిస్ బ్యాంక్ (-0.53%).


More Telugu News