అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలి వాటమే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
- బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారన్న బీజేపీ నేత
- కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపణ
- లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీయే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా
గత ఏడాది చివరలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం గాలివాటమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీయే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలలో తాము గట్టి పోటీ ఇస్తామని... పదికి తక్కువ కాకుండా గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి తమకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతో ఇండియా కూటమి నుంచి పలు పార్టీలు, నాయకులు బయటకు వస్తున్నారన్నారు.