'ఊరుపేరు భైరవకోన' 3 రోజుల వసూళ్లు ఇవే!

  • శుక్రవారం విడుదలైన 'ఊరుపేరు భైరవకోన'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు
  • దర్శకుడిగా వీఐ ఆనంద్ చేసిన ప్రయోగం  
  • 3 రోజులలో 20.30 కోట్లను వసూలు చేసిన సినిమా

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన 'ఊరుపేరు భైరవకోన' సినిమా, ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. పోటీ ఎక్కువగా లేని సమయం చూసి ఈ సినిమా బరిలోకి దిగింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫాంటసీ టచ్ తో హారర్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. వర్ష బొల్లమ్మ - కావ్య థాపర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఈ సినిమా విడుదలై నిన్నటితో 3 రోజులైంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా 20.30 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో 3 రోజులలో సందీప్ కిషన్ చూసిన అత్యధిక వసూళ్లు ఇవేనని చెప్పాలి. వీకెండ్ తరువాత ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి. తొలి రోజునే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషమే.

పగ .. ద్వేషంతో రగిలిపోయే ప్రేతాత్మలు 'భైరవకోన' అనే గ్రామంలో బందీలవుతాయి. ఆ గ్రామంలోకి అడుగుపెట్టినవారిని ఆ ప్రేతాత్మలు అంతం చేస్తూ ఉంటాయి. తన ప్రియురాలి ఆశయాన్ని నెరవేర్చడానికి గాను హీరో .. ఆ గ్రామంలోకి అడుగుపెట్టవలసి వస్తుంది. అప్పుడు తాను ఏం చేస్తాడు? అనేదే కథ. రవి శంకర్ .. మైమ్ గోపి .. వడి ఉక్కరసు కీలకమైన పాత్రలను పోషించారు. 


More Telugu News