సీజేఐ మెర్సిడెస్ కారు నంబరు వైరల్.. చూస్తే మీరూ ఔరా అంటారు!
- కారు నంబరు పోస్టు చేసిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాయిడ్ మాథియస్
- సీజేఐ కలిసొచ్చేలా నంబర్
- సుప్రీంకోర్టు పేరుతో రిజిస్టర్ అయిన కారు
- ధర రూ.88.96 లక్షలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిస్ట్ డీవై చంద్రచూడ్ కారు నంబర్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. లాయిడ్ మాథియస్ అనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఈ నంబర్ ప్లేట్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు సీజేఐ హాజరైనప్పుడు తాను బయటకు వెళ్తున్నప్పుడు ఆ కారు నంబరును చూడకుండా ఉండలేకపోయానని పేర్కొన్నారు. ఇంతకీ ఆ కారు నంబర్ ఏంటో తెలుసా? DL1 CJI 0001. నంబరుకు ముందు సీజేఐ ఉండడమే ఆయన ఆశ్చర్యానికి కారణం. దీనిని బట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కారు నంబరు DL1 CEC 0001 అయితే ఆశ్చర్యమే అంటూ సీజేఐ కారును ఫొటో తీసి పోస్ట్ చేశారు.
సీజేఐ వచ్చిన మెర్సిడెస్ ఈ 350 మోడల్ కారు ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉందా అని ఆరా తీస్తే అది భారత సుప్రీంకోర్టు పేరుపై రిజిస్టర్ అయి ఉంది. దీనినిబట్టి సీజేఐకి ఆ కారును సుప్రీంకోర్టు సమకూర్చి ఉంటుందని అర్థమైంది. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ 350 డీ ఏఎంజీ లైనప్ ఈ-క్లాస్‌లో టాప్ మోడల్. దీని ధర రూ. 88.96 లక్షలు.