విమానం క్రూపై అర్ధనగ్న ప్రయాణికుడి ముష్టిఘాతాలు.. వైరల్ వీడియో ఇదిగో
- బ్యాంకాక్ నుంచి లండన్ వెళుతున్న విమానంలో ఫిబ్రవరి 7న ఘటన
- బాత్రూమ్ డోర్ పగలగొట్టిన ప్రయాణికుడు
- అడ్డొచ్చిన ప్యాసెంజర్లపై దాడి, క్రూ సిబ్బందిలో ఒకరిపై చేయిచేసుకున్న వైనం
- అతడి చేతులు కట్టేసి నిలువరించిన తోటి ప్రయాణికులు
- లండన్ చేరుకున్నాక అరెస్ట్
థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా విమాన సిబ్బందిలో ఒకరిపై చేయిచేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్యాసెంజర్ వీడియోను రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు.
బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానంలో ఫిబ్రవరి 7న ఈ ఘటన జరిగింది. నిందితుడు తొలుత విమానం టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. ఆ తరువాత అకస్మాత్తుగా పెద్ద పెట్టున అరుస్తూ బాత్రూమ్ తలుపులపై గట్టిగా చరిచి వాటిని విరగ్గొట్టాడు. అర్ధనగ్న స్థితిలో నానా రభసా సృష్టించాడు.
ఇదంతా చూసిన ఇతర ప్రయాణికులు అతడిని నిలువరించే క్రమంలో గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే అక్కడికొచ్చిన క్రూ సిబ్బందిలో ఒకరిపై నిందితుడు చేయి చేసుకున్నాడు. అతడి ముష్టిఘాతాలకు బాధితుడి ముక్కు విరిగిపోయింది. ఈలోపు ఇతర ప్రయాణికులు అతడి చేతులు కట్టేసి సీటులో కూర్చోపెట్టారు. ప్రయాణం ముగిసే వరకూ పక్కనే ఉండి అతడు కదలకుండా నిలువరించారు. అయినా కూడా అతడు దుర్భాషలాడుతూ నానా రభస సృష్టించాడని ఇతర ప్రయాణికులు తెలిపారు.
లండన్‌లోని హిత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి దిగినందుకు, విమానాన్ని ప్రమాదంలో పడేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.