చర్చకు నేను సిద్ధం... నీకు దమ్ముందా?... సీఎం జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్
- రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు
- బూటకపు ప్రసంగాలు కాదు... దమ్ముంటే చర్చకు రావాలన్న చంద్రబాబు
- ఓటమి భయంతో జగన్ బదిలీల పేరిట 77 మందిని మడతపెట్టాడని వెల్లడి
- మిగతా ఎమ్మెల్యేలను జనం మడతపెడతారని వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ ఇవాళ రాప్తాడులో సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ తో చర్చించేందుకు నేను సిద్ధం... నాతో చర్చకు వచ్చే దమ్ముందా జగన్? అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదు... దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి అని స్పష్టం చేశారు.
"అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసక పాలన ఎవరిదో చర్చిద్దాం... ఎవరి పాలన స్వర్ణయుగయో, ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దాం అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఒకే ఒక్క చాన్సే జగన్ కు చివరి చాన్స్ అని చంద్రబాబు పేర్కొన్నారు. మీ ఫ్యాను రెక్కలు విరగ్గొట్టేందుకు జనం కసితో ఉన్నారు.
ఓటమి భయంతో బదిలీల పేరిట 77 మందిని జగన్ మడతపెట్టారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడతపెడతారు. 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచిన జగన్ సంక్షేమం గురించి చెప్పడమా? ఏపీలో ఎక్కడ చూసినా అభివృద్ధి కాదు, విధ్వంసం కనిపిస్తోంది" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.