అత్తమ్మాస్ కిచెన్... ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన, కొణిదెల సురేఖ
- కొణిదెల సురేఖ పుట్టినరోజు సందర్భంగా కొత్త వ్యాపారం ప్రారంభం
- ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చే రెడీ టు మిక్స్ వంటకాల ఆవిష్కరణ
- వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు
మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెగా అత్తాకోడళ్లు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. కొణిదెల సురేఖ పుట్టినరోజును పురస్కరించుకుని అత్తమ్మాస్ కిచెన్ పేరిట కొత్త వ్యాపారం ప్రారంభించారు.
ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా, పులిహోర, పొంగల్, రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. అత్తాకోడళ్ల బంధాన్ని పునర్ నిర్వచిస్తూ కొణిదెల వారి సంప్రదాయాల స్ఫూర్తిగా సరికొత్త రెసిపీలను ప్రజలకు అందించనున్నారు.
దీనిపై ఉపాసన స్పందిస్తూ, నేరుగా మా వంట గది నుంచే మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయి... తరతరాల ఆహార అనుబంధాన్ని ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశారు. కాగా, అతమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు, రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా athammaskitchen.com వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఆన్ లైన్ లో తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు.