చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్
- హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలో విస్తారా విమానమెక్కిన రష్మిక
- టేకాఫ్ అయిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య
- వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ల్యాండ్ చేసిన పైలట్లు
- మరో విమానంలో ప్రయాణికులను తరలించిన విస్తారా
- సహనటి శ్రద్ధాదాస్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ ఇన్‌స్టా స్టోరీలో చేదు అనుభవాన్ని పంచుకున్న నటి
ప్రముఖ సినీ నీటి రష్మిక మందన్న నిన్న తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలో రష్మిక విమానమెక్కింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తిరిగి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వెంటనే రష్మి తన సహ నటి, తనతోపాటు ప్రయాణిస్తున్న శ్రద్ధాదాస్ కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ చావు నుంచి తాము ఎలా తప్పించుకున్నదీ వెల్లడించింది.
అది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రష్మిక, శ్రద్ధాదాస్ ఇద్దరూ ముంబై నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత అనుకోని సాంకేతిక కారణాలతో విమానం వెనక్కి వచ్చి ల్యాండైంది. ఈ ఘటనపై విస్తారా విమానం అధికార ప్రతినిధి స్పందిస్తూ విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్లు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించారని తెలిపారు. అవసరమైన పరీక్షల తర్వాత విమానం మళ్లీ సేవల్లోకి వచ్చిందని, ఆలోగా ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలిపారు.