టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌తేజ్ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు
- సాయిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గాంజా శంకర్’
- టైటిల్ నుంచి గాంజా పదాన్ని తొలగించాలని ఆదేశం
- సినిమాలో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్ నుంచి గంజాయి (గాంజా) అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు.
సినిమాలో డ్రగ్స్‌కు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు కనుక ఉంటే ఎన్డీపీఎస్- 1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. గాంజా శంకర్ అనే పేరు విద్యార్థులు, యువతపై ప్రభావం చూపిస్తుందని, కాబట్టి దానిని తొలగించాలని సూచించారు. గంజాయికి సంబంధించిన సీన్స్, డైలాగులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.