సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షల హాల్ టికెట్‌

  • అడ్మిట్ కార్డుపై ఆమె పేరు, ఫొటో, ఇతర వివరాలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
  • కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు లేదా ఇతర అకడమిక్ పరీక్షల్లో తప్పులు దొర్లడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. హాల్ టికెట్లపై పేరు తప్పుగా పడడం లేదా ఒకరి ఫొటోకి బదులు మరొకటి ముద్రించడం చూస్తుంటాం. కానీ అంతకుమించి అన్నట్టుగా ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ హాల్ టికెట్ బయటపడింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్‌ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్‌పై ఆమె పేరు, ఫొటో  వివరాలు ముద్రించి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 17న పరీక్ష ఉందని అడ్మిట్ కార్డుపై ఉంది.
 
కాగా ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (UPPRB) వెబ్‌సైట్‌లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తించారు. అడ్మిట్ కార్డు ప్రకారం సన్నీ లియోన్ పరీక్షా కేంద్రం కన్నౌజ్‌ జిల్లాలోని తిర్వా తహసిల్‌లో ఉన్న సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాష్ట్రవ్యాప్తంగా 75 జిల్లాల్లో 2,385 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరిగింది.


More Telugu News