మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ప్రారంభం

  • బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
  • జాతరకు గతంలో కంటే రెట్టింపుగా ఆరువేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • ఆర్టీసీ సిబ్బంది ఓపికతో బస్సులు నడపాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచన
టీఎస్ఆర్టీసీ మేడారంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసింది. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా శనివారం ఈ బస్టాండ్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... జాతరకు గతంలో కంటే రెట్టింపుగా ఆరువేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఓపికతో బస్సులు నడపాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలన్నారు.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్ టికెట్ కౌంటర్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.


More Telugu News