ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఆనాడు బీజేపీతో విభేదించాను: చంద్రబాబు
- పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలిరా సభ
- ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారన్న చంద్రబాబు
- కేంద్రం సాయం చేస్తామన్నా తీసుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదించానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రజల కోసమే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం సాయం చేస్తామన్నా, ఆ సాయం అందుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని చంద్రబాబు విమర్శించారు.
ఇది పోయే ప్రభుత్వం... పోలీసులు కూడా మునిగిపోతారు!
ఇంకొల్లులో రా కదలిరా సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇది పోయే ప్రభుత్వం... ఇలాంటి ప్రభుత్వాన్ని మోయాలని చూస్తే పోలీసులు కూడా మునిగిపోతారు. నోటీసుల్లో ఏం ఉందో చూడకుండానే సభ ఆపాలని ఎస్పీ అంటారా? మేం చట్టానికి లోబడే సభ ఏర్పాటు చేసుకున్నాం. అన్యాయంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తొక్కుకుంటూ వెళతాం... అని చంద్రబాబు స్పష్టం చేశారు.