బీజేపీలో చేరిక ఊహాగానాలపై తొలిసారి స్పందించిన కమల్ నాథ్
- అలాంటిదేమీ లేదని కొట్టిపారేసిన కాంగ్రెస్ సీనియర్
- ఏదైనా ఉంటే మీడియాకు చెబుతానంటూ వ్యాఖ్య
- ఢిల్లీ వెళ్లిన కమల్‌నాథ్.. బీజేపీతో నేతలతో చర్చించబోతున్నారంటూ ప్రచారం
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ బీజేపీలో చేరబోతున్నారంటూ వెలువడుతున్న ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. బీజేపీలో చేరబోతున్నారా? అని మీడియా ప్రశ్నించిగా.. ‘‘ అలాంటిదేమైనా ఉంటే నేను మీడియాకు తెలియజేస్తాను’’ అని కమల్‌నాథ్ అన్నారు. అత్యుత్సాహానికి పోవద్దని మీడియాని కోరారు. పార్టీ మారబోనని తిరస్కరించడం లేదు కదా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇది తిరస్కరించడానికి సంబంధించినది కాదని అన్నారు. ‘పార్టీ మారతానని మీరు ఎలా చెప్తున్నారు’ అని రిపోర్టర్‌ని ఎదురు ప్రశ్నించారు. తనకు ఎలాంటి ఉత్సాహంలేదని కమల్‌నాథ్ అన్నారు. కమల్‌నాథ్ బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు కమల్‌నాథ్ బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన సన్నిహిత వర్గాలు ఈ ప్రచారానికి బలం చేకూర్చుతున్నాయి. కమల్‌నాథ్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ చాలా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ ఇదివరకు ఉన్నట్టు లేదని ఆయన వాపోతున్నట్టు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. కాగా గతేడాది చివరిలో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్ ఓడిపోయారు. అయితే పార్టీ తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదని, అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారని కమల్‌నాథ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.