సీఎం జగన్ కు లేఖ రాసిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు

  • జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలేదని విమర్శలు
  • అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వ డబ్బు అడగడంలేదన్న ముప్పాళ్ల
  • బాధితులు దీక్ష చేసినా స్పందించడంలేదని వ్యాఖ్యలు
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారని, అగ్రిగోల్డ్ ఆస్తులు అడ్డగోలుగా అమ్ముకోకుండా అటాచ్ చేయించామని తెలిపారు. మాది మానవత్వం ఉన్న ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్... ఐదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలేదని ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. 

అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వ డబ్బు అడగడం లేదని, అగ్రిగోల్డ్ ఆస్తులే రూ.30 వేల కోట్ల వరకు ఉన్నాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులను ఆదుకుంటామన్న హామీని మరిచారా? అంటూ ముప్పాళ్ల నాగేశ్వరావు సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు. 

చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబ సభ్యులకు పరిహారం ఇస్తామన్నారని, బాధితులు దీక్ష చేసినా స్పందించలేదని... అందుకే బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని వివరించారు.


More Telugu News