ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే... ఎంతిస్తావని అతడ్ని అడిగారు: నారా లోకేశ్

  • శృంగవరపుకోటలో శంఖారావం
  • హాజరైన నారా లోకేశ్
  • ఎస్ కోటను అవినీతి కోటగా మార్చేశారని ఆవేదన
  • తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు.  

ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపుకోటను ఇవాళ అవినీతి కోటగా మార్చేశారని విమర్శించారు. విశాఖలో జగన్ రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటుంటే, ఇక్కడి ఎమ్మెల్యే రూ.50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని అన్నారు. 

మన డబ్బులు దోచేసి ఇళ్లు కట్టుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే... ఎంతిస్తావని అతడ్ని అడిగారని ఆరోపించారు.  

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపించాలని, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చుతున్నాడని ఆరోపించారు.


More Telugu News