వైసీపీ ఏడవ జాబితా.. ఇద్దరికి టికెట్ నిరాకరణ!

వైసీపీ ఏడవ జాబితా.. ఇద్దరికి టికెట్ నిరాకరణ!
  • రెండు మార్పులతో ఏడో జాబితా విడుదల
  • కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరణ
  • పర్చూరు ఇన్ఛార్జీగా యడం బాలాజీ నియామకం
రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పులను వైసీపీ నాయకత్వం కొనసాగిస్తోంది. తాజాగా నిన్న రాత్రి వైసీపీ ఏడో జాబితాను విడుదల చేసింది. ఏడో జాబితాలో ఇద్దరికి టికెట్ ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కటారి అరవింద యాదవ్ ను జగన్ రంగంలోకి దించారు. పర్చూరు ఇన్ఛార్జీగా యడం బాలాజీని నియమించారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించే ఏడో జాబితాను విడుదల చేశారు. మరోవైపు, తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని ఆమంచి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. 



More Telugu News