ఓటీటీకి వచ్చేసిన 'నా సామిరంగ'

  • జనవరి 14న విడుదలైన 'నా సామిరంగ' 
  • పండుగ నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • నాగార్జునకి హిట్ తెచ్చిపెట్టిన సినిమా
  • ఈ రోజు నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగ'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఆషిక రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు తీసుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అందువలన ఈ సినిమాను తప్పకుండా బరిలోకి దింపాలని పట్టుదలతో ఆయన ఈ సినిమాను 3 నెలల్లో పూర్తి చేశారు .. అనుకున్నట్టుగానే సక్సెస్ ను సాధించారు. 

ఈ కథ .. భోగి - సంక్రాంతి - కనుమ పండుగల నేపథ్యంలో నడుస్తుంది. హీరో - హీరోయిన్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకునేలోగా ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. స్నేహం .. ప్రేమ .. త్యాగం అనే మూడు ప్రధానమైన అంశాల చుట్టూ తిరిగే ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. 


More Telugu News