హైదరాబాద్‌లో భారత్ - కువైట్‌ ఫిఫా క్వాలిఫయర్ మ్యాచ్

  • గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం
  • ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడితో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
  • మ్యాచ్ నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందన్న సీఎం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా క్వాలిఫయర్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలోని సీఎం కార్యాలయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబేతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు. 

వచ్చే జూన్ 6వ తేదీన దేశంలో నిర్వహించాల్సిన భారత్-కువైట్‌ జట్ల మధ్య క్వాలిఫయర్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపుతున్నాయని కల్యాణ్ సింగ్ తెలిపారు. కాబట్టి, ఈ విషయంలో తెలంగాణ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ఆ ఫిఫా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యత మొత్తం తెలంగాణ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.


More Telugu News