సోనియాగాంధీ ఆస్తుల విలువ రూ.12.53 కోట్లు

  • రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
  • 12.53 కోట్ల ఆస్తులను ప్రకటించిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
  • ఇటలీలోని తన నివాసం విలువ రూ.27 లక్షలుగా ఉన్నట్లు వెల్లడి
ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చర, స్థిరాస్థుల విలువ రూ.12.53 కోట్లు. ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తుల వివరాలను సమర్పించారు. సోనియా గాంధీ తన ఆస్తులను రూ.12.53 కోట్లుగా ప్రకటించారు. 2014లో ఆమె సంపద రూ.9.28 కోట్లుగా ఉండగా 2019 నాటికి రూ.11.82 కోట్లకు పెరిగింది. సోనియా గాంధీ వద్ద రూ.1 కోటి విలువైన ఆభరణాలు ఉన్నాయి.

అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చరాస్తులు రూ.6.38 కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీగా తన జీతమే తన ఆదాయవనరు అని పేర్కొన్నారు. అలాగే ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన నివాసం విలువ రూ.27 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. సోనియాగాంధీకి వ్యక్తిగతంగా కారు లేదు.


More Telugu News