రేపు ఇంకొల్లులో చంద్రబాబు పర్యటన... సభా స్థలంపై వివాదం
- రేపు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ఇంకొల్లులో రా కదలిరా సభ
- సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ లో ఇంకొల్లు చేరుకోనున్న చంద్రబాబు
- చంద్రబాబు సభ కోసం స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చిన కౌలు రైతు
- రైతుకు నోటీసులు ఇచ్చిన దేవాదాయ శాఖ అధికారులు!
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో రా కదలిరా సభకు హాజరుకానున్నారు. చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో ఇంకొల్లు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ అధినేత ఇంకొల్లు చేరుకుంటారు. రా కదలిరా సభ ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ లో ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.
కాగా, రేపు ఇంకొల్లులో రా కదలిరా సభ నిర్వహిస్తున్న స్థలం దేవాదాయశాఖకు చెందిన భూమి అని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సభ నిర్వహణ కోసం వెంకట నారాయణ అనే కౌలు రైతు ఈ భూమిని సభ కోసం స్వచ్ఛందంగా ఇవ్వగా... వెంకట నారాయణకు దేవాదాయశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు, పార్కింగ్ కోసం తీసుకున్న స్థలం ఆర్టీసీకి చెందినదంటూ ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.
వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కుట్రలను భగ్నం చేసి, చంద్రబాబు రా కదలిరా సభను విజయవంతం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.