పదవీ బాధ్యతలను చేపట్టిన తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

పదవీ బాధ్యతలను చేపట్టిన తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం
  • ఫిబ్రవరి 11న తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు
  • విజయం సాధించిన వీరశంకర్ ప్యానెల్
  • నేడు హైదరాబాద్ లో బాధ్యతల స్వీకరణ
ఈ నెల 11న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం (టీఎఫ్ డీఏ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వీరశంకర్ ప్యానెల్ విజయం సాధించింది. నేడు సినీ దర్శకుల సంఘం నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. రథసప్తమి పర్వదినం నేపథ్యంలో ఇవాళ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. 

టీఎఫ్ డీఏ అధ్యక్షుడు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, వశిష్ఠ... ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ట్రెజరర్ గా రామారావు, జాయింట్ సెక్రటరీలు వడ్డాణం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి... కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్, కూరపాటి రామారావు, ఆకాశ్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఎఫ్ డీఏ నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని వెల్లడించారు. అతి కొద్ది కాలంలోనే తమ సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని మీడియాకు తెలియజేశారు


More Telugu News