ఎన్నికలు హింసాయుతంగా జరగబోతున్నాయనేదానికి జగన్ వ్యాఖ్యలే సంకేతం: కూన రవికుమార్
- చంద్రబాబు సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్న కూన
- టీడీపీ, జనసేనలను హెచ్చరించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్య
- ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
చొక్కాలు మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమయిందంటూ నిన్న వాలంటీర్లతో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందిస్తూ... జగన్ వ్యాఖ్యలు చూస్తే రాబోయే ఎన్నికలు హింసాయుతంగా జరగబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని చెప్పారు. పేదల కోసం చంద్రబాబు ప్రకటించిన 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ'కి 95 లక్షల కుటుంబాలు మద్దతుగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబుపై నమ్మకం ఉంచిన 95 లక్షల కుటుంబాలకు ధన్యవాదాలు చెపుతున్నామని తెలిపారు.
చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను జనసేనతో కలిసి టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాలని రవికుమార్ చెప్పారు. జగన్ ను ఇంటికి పంపేందుకు జనాలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేనను హెచ్చరించేలా జగన్ వ్యాఖ్యలు చేశారని... తాము చేసే వ్యాఖ్యలు కూడా జగన్ కు, వైసీపీకి హెచ్చరికలే అని చెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని... లేకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశాలు ఉండవని చెప్పారు.