సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ప్రయోజనం కలిగింది?: అక్బరుద్దీన్ ఒవైసీ
- 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే
- సర్వే వివరాలు ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? అని నిలదీత
- ఇప్పటికైనా సమగ్ర సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్
2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ప్రయోజనం కలిగింది? సర్వే వివరాలు ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? అని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కుల గణన తీర్మానంపై శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ... ఇప్పటికైనా సమగ్ర సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
బీఏసీలో చెప్పని అంశాలపై చర్చ ఎందుకు పెట్టారు?
బీఏసీలో చెప్పని అంశాలపై చర్చ ఎందుకు పెట్టారని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సభా కార్యకలాపాలను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారన్నారు. పార్టీలను విశ్వాసంలోకి తీసుకోనప్పుడు బీఏసీ ఎందుకు? అని నిలదీశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదని మండిపడ్డారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదన్నారు. కులగణనకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూడాలని సూచించారు.