తక్కువ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్లు వీరే!
- 98 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన అశ్విన్
- 87 టెస్టుల్లోనే ఈ ఘనతను సాధించిన మురళీధరన్
- 105 టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్ లో చేరిన అనిల్ కుంబ్లే
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలేను అశ్విన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 500 వికెట్లను అశ్విన్ తీశాడు. 98 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. ఈ ఘనతను సాధించిన రెండో భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అనిల్ కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లను సాధించాడు. అయితే 87 మ్యాచుల్లోనే 500 వికెట్లను సాధించిన ఘనతను శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ 108 మ్యాచుల్లో, మెక్ గ్రాత్ 110 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 131 పరుగులు, జడేజా 112 పరుగులు చేయగా... తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 330 పరుగులు వెనుకబడి ఉంది.