పులి చెబుతున్న గుణపాఠం! మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా?
- తటాకంలోని ప్లాస్టిక్ బాటిల్‌ను బైటకు తీసిన పులి
- ఈ దృశ్యాల్ని నెట్టింట పంచుకున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్
- పులి మనుషులకు ఓ గుణపాఠం చెబుతోందంటూ కామెంట్
- వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన
- మానవాళి తన తప్పులను ఎప్పుడు సరిదిద్దుకుంటుందో అంటూ వ్యాఖ్యలు
ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పులి తనకు సమీపంలోని తటాకంలో పడున్న వ్యర్థ ప్లాస్టిక్ బాటిల్ ను నోట కరుచుకుని బయటకు తీసుకొచ్చింది. దీప్ కాథీకర్ అనే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. పులి గొప్ప పని చేసిందని కితాబునిచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం, నిరాశ వ్యక్తమయ్యాయి. పులి చెబుతున్న ఈ గుణపాఠం మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అంటూ కొందరు కామెంట్ చేశారు.