మేడారం జాతరకు వెళ్తున్నారా?.. ఈసారి ఆకాశమార్గంలో ట్రై చేయండి!

  • హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు
  • హెలికాప్టర్‌లో వెళ్లే వారికి ప్రత్యేక దర్శనం
  • 21 నుంచి 25 వరకు అందుబాటులో సేవలు
  • ఒకటి రెండు రోజుల్లో ధరల వెల్లడి
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. 

ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మేడారం భక్తుల కోసం పర్యాటకశాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ధరల వివరాల ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు! 


More Telugu News