హరీశ్ రావు అధ్యక్షుడైతేనే బీఆర్ఎస్ బతుకుతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • అవినీతి మచ్చలేని బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలోకి వస్తే తీసుకుంటామని వ్యాఖ్య
  • డబ్బులు ఉన్న నేతలు వస్తే ఎలా వాడుకోవాలో మాకు తెలుసునని వ్యాఖ్య
  • ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలని వ్యాఖ్య
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ రావు ఆ పార్టీకి అధ్యక్షుడిగా కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అవినీతి మచ్చలేని బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీలోకి వస్తే తీసుకుంటామన్నారు. అలాగే డబ్బులు ఉన్న నేతలు వస్తే ఎలా వాడుకోవాలో తమకు తెలుసునని చెప్పారు. ఎన్నిసార్లు అధికారంలో ఉంటామో చెప్పలేమన్నారు. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలని వ్యాఖ్యానించారు. అయిదేళ్లు తమ ప్రభుత్వానికి తిరుగు లేదన్నారు. బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్ రావు అధ్యక్షుడు కావాలని ఆయన చెప్పారు.


More Telugu News