రోహిత్, జడేజా సెంచరీలు.. ముగిసిన మూడో టెస్ట్ తొలి రోజు ఆట

  • భారత్ స్కోరు 326/5 వద్ద ముగిసిన మొదటి రోజు ఆట
  • 131 పరుగులతో రాణించిన హిట్‌మ్యాన్
  • 110 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆల్‌రౌండర్ జడేజా
  • అరంగేట్ర మ్యాచ్‌లో 62 పరుగులతో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్
  • తొలి సెషన్‌లో తడబడినా ఆ తర్వాత కోలుకున్న టీమిండియా
రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131), స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (110 నాటౌట్) శతకాలతో రాణించడంతో మంచి స్థితిలో నిలిచింది. ఇక అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 62 పరుగులు బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. 

తొలి సెషన్‌లో టీమిండియా కేవలం 33 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు అనిపించింది. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్‌లు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి ఇన్నింగ్స్‌ను సరిదిద్దారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా నాలుగో వికెట్‌కు ఏకంగా 204 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) క్రీజులో ఉన్నారు.

భారత బ్యాటింగ్
యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (131), శుభ్‌మాన్ గిల్(0), రజత్ పటీదార్ (5), రవీంద్ర జడేజా(110 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (62 రనౌట్), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3 కీలకమైన వికెట్లు తీశాడు. మరో వికెట్ టామ్ హార్ట్లీకి దక్కగా మరో వికెట్ రనౌట్ రూపంలో ఇంగ్లండ్‌కి దక్కింది.


More Telugu News