అందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దించారు: సీఎం రేవంత్ రెడ్డి

  • గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దించారన్న ముఖ్యమంత్రి
  • ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ
  • బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే... ఉద్యోగాలు ఇస్తామని మేం చెప్పామన్న రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యానికి తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్‌ను గద్దె దించారన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం గట్టారన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పామన్నారు. 567 గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవలే గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేశామన్నారు.


More Telugu News