తెలంగాణపై రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది: మల్లు భట్టి విక్రమార్క

  • తెలంగాణలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయని వ్యాఖ్య
  • గతంలో బడ్జెట్‌కు ప్రతి సంవత్సరం ఇరవై శాతం పెంచుకుంటూ పోయారన్న మల్లు భట్టి
  • బడ్జెట్, బడ్జెటేతర రుణాలను ఎఫ్ఆర్బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని వెల్లడి
తెలంగాణపై మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నారు. అసమానతలను తొలగించేందుకు బడ్జెట్ ద్వారా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతామన్నారు. గతంలో బడ్జెట్‌కు ప్రతి సంవత్సరం ఇరవై శాతం పెంచుకుంటూ పోయారని తెలిపారు.

 రాజస్థాన్‌లో బడ్జెట్ కంటే అధికంగా ఖర్చు చేశారని తెలిపారు. రాజస్థాన్‌లో రూ.2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్ పెడితే ప్రమాదమన్నారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. బడ్జెట్, బడ్జెటేతర రుణాలను ఎఫ్ఆర్బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందన్నారు.


More Telugu News