సెంచరీతో విరుచుకుపడ్డ రోహిత్ శర్మ.. జడేజా హాఫ్ సెంచరీ
- 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇండియా
- ఇన్నింగ్స్ ను నిర్మించిన రోహిత్, జడేజా
- 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వైనం
రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబాటుకు గురైంది. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జడేజాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ముచ్చటైన ఆటతీరుతో 2 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో సెంచరీని (157 బంతులు) సాధించాడు. తన టెస్ట్ కెరీర్ లో 11వ సెంచరీని సాధించాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఇండియన్ బ్యాట్స్ మెన్ గా ఘనత సాధించాడు.
మరోవైపు రోహిత్ శర్మకు అండగా అవతలి ఎండ్ లో జడేజా కూడా అద్భుతమైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 106 పరుగులు, జడేజా 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు.