బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు వద్దిరాజు రవిచంద్ర

  • నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్
  • రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వద్దిరాజు రవిచంద్ర
  • ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ పదవీ కాలం
బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం రవిచంద్ర పేరును ఖరారు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన నేడు (గురువారం) నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

వద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏప్రిల్ నెలలో ముగియనుంది. మొదటి దఫాలో దాదాపు రెండేళ్లు సభ్యుడిగా కొనసాగుతారు. 2022లో బీఆర్ఎస్ ఆయనను రాజ్యసభకు పంపించింది. ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు పార్టీ తరఫున ఆయనను ఖరారు చేసింది. బీఆర్ఎస్ ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది.


More Telugu News