రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ కు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
- కాసేపట్లో నామినేషన్ వేయనున్న రేణుక, అనిల్
- నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రవిచంద్ర
- ఏపీలో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్... బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. కాసేపట్లో వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు.
మరోవైపు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.