రాజ్ కోట్ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. అశ్విన్ ని ఊరిస్తున్న రికార్డు
- టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్, ధృవ్ జురేల్
- బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా
- 500 టెస్ట్ వికెట్లకు మరో వికెట్ దూరంలో అశ్విన్
ఇండియా - ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్ కోట్ లో ప్రారంభమయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, జైశ్వాల్ క్రీజులోకి అడుగుపెట్టారు.
ఇండియా జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జైశ్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
ఈ టెస్టులో అశ్విన్ ను ఒక రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు అశ్విన్ ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ఇదే సమయంలో మరో 5 వికెట్లు సాధిస్తే జేమ్స్ ఆండర్సన్ 700 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి చేరుతాడు.