బెంగళూరులో త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు

  • చైనా నుంచి బెంగళూరుకు చేరుకున్న డ్రైవర్ లెస్ రైలు
  • నగరానికి చేరుకున్న ఆరు కోచ్‌లను హెబ్బగోడి డిపోకు తరలింపు
  • మొత్తం 216 కోచ్‌లకు ఆర్డరిచ్చామన్న బెంగళూరు మెట్రో
  • ఎల్లో లైన్లో 90 కోచ్‌లతో 15 రైళ్లను నడుపుతామని వెల్లడి
బెంగళూరు నగర వాసులకు త్వరలో డ్రైవర్ రహిత మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. చైనా నుంచి ఆరు కోచ్‌లతో కూడిన తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుంది. ఈ కోచ్‌లను నగరంలోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోగల హెబ్బగోడి డిపోకు తరలించారు. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 

ఈ రైలును ఎల్లో లైన్లో ఆర్వీ రోడ్ నుంచి సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ వరకూ నడపనున్నట్టు మెట్రో సంస్థ వెల్లడించింది. రైలు, ఇతర కోచ్‌లను చైనా సంస్థ నిర్మించిందని, మొత్తం 216 కోచ్‌ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నామని వెల్లడించింది. మొత్తం కోచ్‌లల్లో 90 కోచ్‌లతో 15 రైళ్లను ఎల్లో లైన్లో నడిపిస్తామని పేర్కొంది. అయితే, ప్రస్తుతం వచ్చింది నమూనా రైలని కూడా బెంగళూరు మెట్రో వెల్లడించింది.


More Telugu News