ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత... రైతులను కలవనున్న ముగ్గురు కేంద్ర మంత్రులు
- డిమాండ్ల సాధన కోసం మరోసారి ఉద్యమించిన రైతులు
- ఢిల్లీ దిశగా వేలాదిగా తరలివచ్చిన పంజాబ్, హర్యానా రైతులు
- పోలీసుల లాఠిచార్జి
కేంద్ర ప్రభుత్వంపై రైతులు మరోసారి ఉద్యమం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం సాగించిన రైతులు... ఈసారి పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణ మాఫీ డిమాండ్లతో పోరు బాట పట్టారు.
ఇప్పటికే ఆర్నెల్లకు సరిపడా నిత్యావసరాలతో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు వేలాదిగా ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా లెక్కచేయకుండా రైతులు ముందుకు దూసుకువస్తుండడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పెద్ద సంఖ్యలో రైతులు గాయాలపాలైనట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, కేంద్రం అప్రమత్తమైంది. రైతులతో చర్చలకు ముగ్గురు కేంద్ర మంత్రులను ముందుకు పంపింది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పియూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల నేతలను కలిసి మాట్లాడనున్నారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన నేపథ్యంలో, కేంద్రం పెద్దలు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా చర్చించారు.
అర్జున్ ముండా దీనిపై మాట్లాడుతూ రైతులతో పూర్తి స్థాయిలో చర్చలకు కమిటీ వేస్తామని తెలిపారు.