రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: చంద్రబాబు
- రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేయరన్న చంద్రబాబు
- వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని వెల్లడి
- అన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయన్న టీడీపీ అధినేత
ఇప్పుడు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టే ఆలోచన లేదని తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని, కంభంపాటి, గొట్టిపాటి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల గురించి వారు ప్రశ్నించగా చంద్రబాబు ఈ మేరకు తెలిపారు.
వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీకి టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అయితే ఆ పార్టీ నుంచి వచ్చే అందరినీ తీసుకోలేమని తెలిపారు. చేరికలు, పొత్తుల కారణంగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని చెప్పారు. అన్నీ లోతుగా ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో రా కదలిరా, నారా లోకేశ్ శంఖారావం సభలతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు.