లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నష్టపోయిన టెక్, ఐటీ సూచీలు
- 268 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 97 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాసి, చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 268 పాయింట్లు లాభపడి 71,822కి చేరుకుంది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 21,840 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ, ఎనర్జీ సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, టెక్, హెల్త్ కేర్ సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా డాలరుతో పోలిస్తే మన కరెన్సీ మారకం విలువ రూ. 83.03గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.24%), టాటా స్టీల్ (2.36%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), మారుతి (2.04%), ఎన్టీపీసీ (1.97%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.78%), సన్ ఫార్మా (-1.26%), టీసీఎస్ (-1.16%), ఇన్ఫోసిస్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.72%).