బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీగా ప్రకటించిన కిషన్ రెడ్డి
- ఉపనేతలుగా పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
- శాసన మండలి పక్షనేతగా ఏవీఎన్ రెడ్డి నియామకం
బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన పేరును ప్రకటించారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డిలను, శాసన మండలి పక్షనేతగా ఏవీఎన్ రెడ్డిలను నియమించారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ గెలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 8 స్థానాల్లో గెలవగా... అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా నాలుగు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా ఎక్కువ అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.