ప్రతిపక్షంలోకి వచ్చినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మీకు మంత్రి పదవి ఎందుకు రాలేదని తనను రెచ్చగొడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి
- బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు కడియం మంత్రి కాలేరని వ్యాఖ్య
- తాటికొండ రాజయ్యను శ్రీహరి మోసం చేశారని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంటే కూర్చో అంటూ కేటీఆర్ అన్నారని... అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని, ఎంత అహంకారమని అన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని రోజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నేత అయిన మీకు మంత్రి పదవి ఎందుకు రాలేదని తనను అడుగుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను మంత్రిని అవుతానో, లేదో తెలియదని.. అయితే బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు మీరు ఈ జన్మలో మంత్రి కాలేరని కదియంను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ కోసం కడియం శ్రీహరి ఏ రోజూ పోరాడలేదని చెప్పారు. ఉద్యమకారుడు తాటికొండ రాజయ్యను కడియం శ్రీహరి మోసం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో కడియం శ్రీహరి అసహనానికి గురవుతున్నారని చెప్పారు.