నన్ను చూడగానే ఎన్టీఆర్ ఆ మాటనే అన్నారు: నటి వై.విజయ
- వెండితెరపై సందడి చేసిన వై.విజయ
- చిన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నానని వెల్లడి
- డాన్స్ వల్లనే సినిమాల్లోకి వచ్చానని వ్యాఖ్య
- ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ మరిచిపోలేనిదని వివరణ
తెలుగు తెరపై వై. విజయ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కొన్ని వందల సినిమాలలో ఆమె నటించారు. ఒకానొక దశలో ఆమె లేని సినిమా ఉండేది కాదు. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆమె అంత బిజీగా ఉండేవారు. అలాంటి వై. విజయ 'ఐ డ్రీమ్' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు.
డాన్స్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో నేను మద్రాస్ వచ్చాను. సన్నగా .. తెల్లగా ఉండేదానిని. డాన్స్ నేర్చుకుంటున్న చోట నన్ను చూసిన వాళ్ల్లే, సినిమాలను గురించిన ప్రస్తావన మా మాస్టర్ గారి దగ్గర చేశారు. అలా సినిమాల నుంచి నాకు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 15 ఏళ్ల లోపు ఉండగానే నాకు 'శ్రీకృష్ణ సత్య' సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది" అన్నారు.
"మా అందరికీ ఎన్టీఆర్ గారంటే ప్రాణం. అలాంటి ఆయన సరసన 'జాంబవతి' పాత్రను చేశాను. అప్పుడు మా పేరెంట్స్ చాలా సంతోషించారు. ఆయనను చూడటానికి కడప నుంచి మా బంధువులు వచ్చారు. నన్ను చూడగానే 'చాలా సన్నగా ఉన్నావు .. నా పక్కన కనిపించాలంటే కాస్త ఒళ్లు చేయాలి' అంటూ, ఆయన నా డేట్స్ ను గుర్తు చేశారు. ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పారు.