'రామం రాఘవం' ఫస్టు గ్లింప్స్ రిలీజ్
- హాస్య నటుడిగా ధన్ రాజ్ కి పేరు
- దర్శకుడిగా ఇది మొదటి సినిమా
- మంచి మార్కులు కొట్టేసిన టైటిల్
- తండ్రీకొడుకుల అనుబంధమే నేపథ్యం
ధన్ రాజ్ కి కమెడియన్ గా గుర్తింపు ఉంది. 'జబర్దస్త్' ద్వారా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ మధ్య నిర్మాతగా మారిపోయి చేసిన సినిమా ఆయనకి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయనే హీరోగా చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో కొంత గ్యాప్ కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మెగా ఫోన్ పట్టుకున్నాడు.
నటుడిగా .. నిర్మాతగానే కాదు దర్శకుడిగా కూడా ఆయన తన ముచ్చట తీర్చుకోవడానికి 'రామం రాఘవం' సినిమాను రూపొందిస్తున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తండ్రిపాత్రలో సముద్రఖని .. కొడుకు పాత్రలో ధన్ రాజ్ నటిస్తున్నారు. కొంత సేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
సహజత్వానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరిస్తున్నారనే విషయం ఈ గ్లిమ్స్ ద్వారా అర్థమవుతోంది. శివప్రసాద్ యానాల అందించిన కథ ఇది. అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించాడు. ఇటు తెలంగాణ .. అటు ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాను చిత్రీకరణ జరుగుతోంది. హరీశ్ ఉత్తమన్ .. మోక్ష .. శ్రీనివాస రెడ్డి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.