మీ స్వాతిముత్యం అల్లుడు తీర్మానానికి ఎందుకు అడ్డు చెప్పలేదు?: రేవంత్ రెడ్డి
- కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింత
- తీర్మానం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసీఆర్
- తీర్మానానికి హరీశ్ రావు మద్దతు పలికాడన్న రేవంత్ రెడ్డి
లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు మాత్రమే నీరందించారంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలని అన్నారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తూ శాసనసభ చేసిన తీర్మానంపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి మేం చేసిన తీర్మానం సరిగా లేకపోతే, మీ స్వాతిముత్యం అల్లుడు ఎలా మద్దతిచ్చాడు? అని ప్రశ్నించారు. తీర్మానానికి మద్దతు ఇచ్చింది హరీశ్ రావు కాదా? అని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించారు... అందుకోసం నిధులు కేటాయించి, బడ్జెట్ ఆమోదం కూడా కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాలు విరిగిన కేసీఆర్ అసెంబ్లీకి రాలేరు కానీ నల్గొండ వెళ్లారు!
కేసీఆర్ తనకు కాలు విరిగిందంటూ కూతవేటు దూరంలోని అసెంబ్లీకి దూరంగా ఉన్నారని, మరి అల్లంత దూరంలో ఉన్న నల్గొండకు ఎలా వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ జంకుతున్నారని, అసెంబ్లీకి వస్తే తన అవినీతిని బట్టబయలు చేస్తారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని, ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించండంపై పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.