యూత్ ను ఊపేస్తున్న 'ప్రేమలు' మూవీ!

  • మలయాళంలో రూపొందిన 'ప్రేమలు'
  • యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ 
  • మౌత్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ 
  • తెలుగులోనూ రిలీజ్ అయ్యే ఛాన్స్ 

సాధారణంగా మలయాళ సినిమాలను ఎక్కువగా కేరళ నేపథ్యంలోనే చిత్రీకరిస్తూ ఉంటారు. అలాంటిది ఒక మలయాళ సినిమాను హైదరాబాద్ లో ఎక్కువగా చిత్రీకరించడమనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అలాంటి ఒక కొత్తదనానికి తెరతీసిన దర్శకుడిగా గిరీశ్ కనిపిస్తాడు. అతను దర్శకత్వం వహించిన ఆ సినిమానే 'ప్రేమలు'.
 
 ఈ కథలోని ఒక జంట మధ్య ప్రేమ హైదరాబాద్ నేపథ్యంలో నడుస్తుంది. అందువలన ఇక్కడి లొకేషన్స్ అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి. ఇక్కడి ఆడియన్స్ కి ఇది మన సినిమానే అనిపిస్తుంది. ఈ నెల 9వ తేదీనే ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా అక్కడి థియేటర్లలో విడుదలైంది. మౌత్ టాక్ తో రోజు రోజుకి వసూళ్లు పెరుగుతుండటం విశేషం. 

ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ఈ ప్రేమకథలో నస్లెన్ .. మమిత బైజు .. అఖిల భార్గవన్ .. మీనాక్షి రవీంద్రన్ .. శ్యామ్ మోహన్ .. షామీర్ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


More Telugu News