మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి, మంత్రులు

  • తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను పరిశీలించిన రేవంత్ అండ్ టీమ్
  • ఏం జరిగిందో అధికారులను అడిగి తెలుసుకున్న రేవంత్
  • పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం
మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృదం పరిశీలించింది. ఏడో బ్లాక్ లోని పలు పిల్లర్లను వీరు పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. 

వీరంతా మూడు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే... 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు.


More Telugu News