జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి: ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు

  • 2019లో రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన జయప్రద
  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసుల నమోదు
  • కోర్టు నోటీసులకు కూడా స్పందించని జయప్రద
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.

దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.


More Telugu News