ఉద్యోగ సంఘాలతో ముగిసిన ఏపీ ప్రభుత్వం చర్చలు
- డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల సమ్మె కార్యాచరణ
- నేడు సచివాలయంలో చర్చలు జరిపిన ఏపీ ప్రభుత్వం
- మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం
ఏపీ జేఏసీ ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాలు డిమాండ్ల సాధన కోసం సమ్మె కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది.
ఈ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని చెప్పారు. మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామని చెప్పారు. ఉద్యోగుల మధ్యంతర భృతిపై పరిశీలిస్తున్నామని బొత్స వివరించారు.