26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి... అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని మల్లారెడ్డి విజ్ఞప్తి
- అసెంబ్లీలో ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చర్చ సమయంలో మల్లారెడ్డి విజ్ఞప్తి
- 14, 15 తేదీలలో వసంత పంచమి ఉంది... ఆ రోజున 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయన్న మల్లారెడ్డి
- ఆ రోజున అసెంబ్లీ పెట్టవద్దని సభాపతిని కోరిన మల్లారెడ్డి
మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. ఈ రోజు కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మల్లారెడ్డి సభాపతికి ఓ రిక్వెస్ట్ చేశారు.
నాదేమీ లేదు... ఒక్కటే నిమిషం... ఒక్కటే సెకండ్... ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను... 14, 15 తేదీలలో వసంత పంచమి ఉంది... ఆ రోజున 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి... కాబట్టి సభ్యులందరి కోరిక మేరకు ఆ రెండు రోజులు అసెంబ్లీ పెట్టవద్దని సభాపతిని కోరారు. మల్లారెడ్డి విజ్ఞప్తితో సభాపతితో పాటు సభ్యులంతా నవ్వేశారు.