గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా

  • హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించిన కోదండరాం, ఆమిర్ అలీఖాన్
  • మరోసారి వాదనలు వినిపించనున్న పిటిషనర్లు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు లాయర్లు
  • దీంతో విచారణను 14వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల తరఫున న్యాయవాదులు వాదనలు ముగించారు. పిటిషనర్లు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. దీంతో హైకోర్టు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు ఫైలు ‌పంపింది. అయితే, ఆ ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా.. గవర్నర్‌ ఆమోదించారు.


More Telugu News