ఏపీలో బీజేపీ పొత్తుపై జీవీఎల్ వ్యాఖ్యలు

  • ఏపీలో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న టీడీపీ-జనసేన
  • ఈ కూటమితో బీజేపీ చేయి కలిపే అంశంపై అనిశ్చితి
  • రాష్ట్ర పార్టీగా తమ ఆలోచనలను బీజేపీ హైకమాండ్ కు తెలియజేశామన్న జీవీఎల్
ఏపీలో టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. 

ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా? లేక, భావ సారూప్యత ఉన్న పార్టీలతో వెళ్లాలా? అనే దానిపై బీజేపీ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆలోచనలను తాము ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశామని జీవీఎల్ వెల్లడించారు. 

బీజేపీని రాష్ట్రంలో బూత్ లెవల్ వరకు తీసుకెళ్లడమే కార్యకర్తలుగా తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించిందన్న అంశం సామాన్యులకు కూడా అర్థమైందని అన్నారు.


More Telugu News